వరి పండించొద్దంటే ఎలా? | - | Sakshi
Sakshi News home page

వరి పండించొద్దంటే ఎలా?

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

మాకు వరి పండడానికి అనుకూలమైన భూములున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వరి సాగుచేయొద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా తూర్పు మండలాల్లో రబీ, ఖరీఫ్‌ రెండు పంట కాలాల్లోనూ వరినే ఎక్కువగా పండిస్తారు. వరి పంట సాగు చేయొద్దని చెప్పడం సరికాదు.

– యచ్చం హరినాథ్‌యాదవ్‌,

అమ్మవారిపట్టెడ, రేణిగుంట మండలం

మామిడికి గిట్టుబాటు ధర ఏదీ?

మామిడి రైతుల పరిస్థితి గత ఏడాది, ఈ ఏడాది దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వంలో మామిడికి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను నట్టేట ముంచింది. సరైన ధర లేకపోవడంతో పంటపై పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాలేదు. ప్రభుత్వం చర్యలు చేపట్టి మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి. – కె.నరసింహారెడ్డి,

రైతు, లింగనపల్లి, పాకాల మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement