భూ తగాదాలతో మహిళపై దాడి | - | Sakshi
Sakshi News home page

భూ తగాదాలతో మహిళపై దాడి

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌ : భూ తగాదాలతో అర్ధరాత్రి ఒంటరి మహిళ పై దాడి జరిగిన సంఘటన చంద్రగిరి నియోజకవర్గ ఎర్రవారిపాలెం మండలం ఈడిగపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలు కృష్ణవేణి తెలిపిన వివరాల మేరకు.. తన భర్త పేరుపై ఉన్న భూమిని ఆయన సోదరులు అక్రమంగా ఆనన్‌లైన్‌లో నమోదు చేసుకుని, ఆ భూమిపై ఇంటి పట్టా పొందడంతో పాటు ఇల్లు నిర్మాణ పనులు చేపట్టారని ఈ విషయమై తాను అభ్యంతరం వ్యక్తం చేసి నిర్మాణ పనులను అడ్డుకోవడంతో తనపై కత్తులు, కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరిగినప్పటికీ, దాడిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె పేర్కొన్నారు.తన భర్త పేరుపై ఉన్న భూమిని తన సమీప బంధువులు రెవెన్యూ అధికారులతో కలిసి అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కృష్ణవేణి ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భూమి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు అధికారులను కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement