ఆరోగ్య యోగం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య యోగం

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఎస్వీయూ తారకరామారావు స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా పోలీసు అధికారులు, విద్యాశాఖతో పాటు పలు శాఖాధికారులు పాల్గొన్నారు. అందరి జీవనవిధానంలో యోగా ఒక భాగం కావాలని ఎస్పీ ఎల్‌ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. జేసీ గోవిందరావు, డీఆర్‌ఓ నర్సింహులు, ఎస్వీయూ వీసీ నర్సింగరావు, రెక్టార్‌ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడు, మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఉమ, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహయాదవ్‌, ఆర్డీవో రామ్మోహన్‌, అడిషనల్‌ ఎస్పీలు శ్రీనివాసులు, శ్రీనివాసరావు, తుడా సెక్రటరీ శ్రీకాంత్‌, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

షార్‌లో

సూళ్లూరుపేట : షార్‌లోని స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌ మైదానంలో షార్‌ ఉద్యోగులు వారి కుటుంబసభ్యులు, సీఐఎస్‌ఎప్‌ భద్రతా సిబ్బంది, విద్యార్థులు స్థానిక ప్రభుత్వ అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. షార్‌ డైరెక్టర్‌ ముత్తు చెళియన్‌, కంట్రోలర్‌ రమేష్‌బాబు షార్‌లోని సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధులు ఆధ్వర్యంలో సుమారు 500 మందికి పైగా యోగాసనాలు చేశారు. డైరెక్టర్‌ ముత్తు చెళియన్‌ బెంగళూరు నుంచి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement