– యూరియా కోసం పడిగాపులు
బుచ్చినాయుడుకండ్రిగ: యూరియా పంపిణీకి సంబంధించి వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన నూతన యాప్‌లతో మండల రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో సులువుగా లభించిన యూరియా కూటమి ప్రభుత్వంలో అందని ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం రైతులు ఆర్‌బీకేల చుట్టూ తిరుగుతున్న అధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. నూతనంగా ప్రవేశ పెట్టిన ఏపీఐఎమ్మెస్ యాప్‌లో తమ పొలం వివరాలు, ఖాతా నంబర్, తప్పనిసరిగా నమోదై ఉంటేనే ఎరువులను అందజేయనున్నామని అధికారులు కొర్రీలు పెడుతుండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఎకరాకు 3 బస్తాలు కావాల్సి ఉండగా 75 కిలోల యూరియాను మాత్రమే ఇస్తామని, అది కూడా యాప్‌లో ఓకే అయితేనేనని చెబుతున్నారన్నారు. యూరియా కోసం ఆర్‌బీకేలు, ప్రైవేటు డీలర్ల చుట్టూ వారం రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నా, ఒక బస్తా సైతం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరణించిన రైతు కుంటుంబాలకు యాప్‌లో నమోదు కాకపోవడంతో వారికి ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీన్ని అదునుగా తీసుకున్న కొందరు ప్రైవేటు షాపుల యాజమానులు యూరియాను పక్కదారి పట్టిసున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 93,303 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 41,688 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


