బకాయిలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

బకాయిలు విడుదల చేయాలి

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

యువగళంలో లోకేష్‌ విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తం సుమారు రూ.7000కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలి. ఈ ఏడాది విద్యార్థులను ఇబ్బంది పెడితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – చిన్న,

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యులు, తిరుపతి

తిరుగుబాటు తప్పదు

విద్యా సంవత్సరం ముగిసిన సందర్భంగా జిల్లాలో పలు కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు యాజమాన్యాలు ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా ధృవపత్రాలను అందించాల్సిందే. ఫీజుతో మెలిక పెడితే తిరుగుబాటు తప్పదు. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా బకాయిలు పూర్తిగా చెల్లించాల్సిందే.

–పవిత్ర, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా అధ్యక్షురాలు

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం ఆపాలి. ప్రభుత్వ తీరుతో ఎంతో మంది గ్రామీణ, పట్టణ ప్రాంత పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆగ్రహానికి గురికాకముందే ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి. – గార్లపాటి శ్రీధర్‌,

ఏపీ స్టూడెంట్స్‌ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement