ఏర్పేడు: మండలం మడిబాక పంచాయతీ రాజులకండ్రిగలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికే పిల్లల నమోదు సంఖ్య 110కి చేరడంతో పాఠశాల హెచ్‌ఎం నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. అయితే ఈ పాఠశాలలో రెండు తరగతి గదులు మాత్రమే ఉండడంతో కొందరిని డెస్క్‌లపై, మరి కొందరిని కింద ఇరుకిరుకుగా కూర్చోబెట్టి పిల్లలకు ప్రత్యక్ష నరకం చూపుతున్నారు.
బ్యాగులేవి?
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ పేరుతో పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్ దుస్తులతోపాటు స్కూల్ బ్యాగు, షూలు, బెల్ట్ అందించాలి. అయితే స్కూల్ బ్యాగులు, షూలు ఇంకా సరఫరా చేయకపోవడంతో గత ఏడాది అందించిన బ్యాగులు పూర్తిగా చిరిగిపోవడంతో వాటిని కుట్టించుకుని పాఠశాలకు వస్తున్నారు. అదనపు తరగతి గదులు మంజూరు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు.


