హిందీ పరీక్షలో ఆరె విద్యార్థికి రాష్ట్రస్థాయి ప్రథమస్థానం | - | Sakshi
Sakshi News home page

హిందీ పరీక్షలో ఆరె విద్యార్థికి రాష్ట్రస్థాయి ప్రథమస్థానం

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

కేవీబీపురం: హిందీ టాలెంట్‌ పరీక్షలో కేవీబీపురం మండలం ఆరె ప్రభుత్వ పాఠశాల పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎం.కృష్ణవేణి రాష్ట్ర ప్రథమస్థానం కై వసం చేసుకుంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు హిందీ పోటీ పరీక్షల్లో సత్తా చాటిన రాష్ట్ర విజేతలకు విశిష్ట హిందీ ప్రతిభ రత్న అవార్డు–2025 ప్రదానోత్సవం శనివారం విజయవాడ యూటీఎఫ్‌ భవన్‌లో నిర్వహించారు. ఆరె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివే కృష్ణవేణి హిందీ ప్రతిభ అన్వేషణ పరీక్షల్లో పాఠశాల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ కనపరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయి అధికారుల సమక్షంలో కృష్ణవేణికి బంగారు పతకం బహూకరించారు. నగదు ప్రోత్సాహం అందించారు. ఈ బహుమానాన్ని కృష్ణవేణి తల్లిదండ్రులు ఢిల్లీ బాబు, శోభన ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రతిభ కనపరచిన కృష్ణవేణిని మండల ఎంఈఓలు లక్ష్మీపతి, రవికుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి నాయుడు, హిందీ ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement