ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం!

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

చంద్రగిరి: విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిన ఘటన శనివారం మండలంలోని పనపాకం పంచాయతీలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. పనపాకం పంచాయతీ ఇరివిశెట్టివారిపల్లెకు చెందిన నాగభూషణం(57) 25 ఏళ్లు గా పంచాయతీలో ఎలక్ట్రికల్‌ హెల్పర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా పనపాకం పే ట సచివాలయం సమీపంలో వీధిదీపాలు పనిచేయకపోవడంతో వాటి మరమ్మతు చేయడానికి వి ద్యుత్‌ అధికారులతో మాట్లాడి ఎల్‌సీ(లైన్‌ క్లియరన్స్‌) తీసుకున్నాడు. మూడు స్తంభాల్లో దీపాలు ఏర్పాటు చేసి, నాలుగో స్తంభంలో పనిచేస్తున్న క్ర మంలో విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై కిందపడిపోయాడు. దీంతో నాగభూషణం గాయపడడంతో గ్రామస్తు లు చంద్రగిరి ఏరియా ఆ స్పత్రికి తరలిస్తుండగా మా ర్గం మధ్యలో మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే సబ్‌స్టేషన్‌ హెల్పర్‌ రెడ్డెప్పకు సమాచారం అందించినా సకాలంలో స్పందించలేదని, లైన్‌మన్‌ గ్రామంలో ఏ సమస్య ఉ న్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement