2002 ఓటర్ల జాబితాలో లొసుగులు | - | Sakshi
Sakshi News home page

2002 ఓటర్ల జాబితాలో లొసుగులు

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

నాయుడుపేట టౌన్‌ః సర్‌ (స్పెషల్‌ ఇన్సెంటివ్‌ రివిజన్‌) కార్యక్రమంలో భాగంగా 2002 ఓటర్ల జాబితాలో పలు లొసుగులు వెలుగు చూస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏలు వెల్లడించారు. నాయుడుపేట పట్టణంలోని 68వ పోలింగ్‌ బూత్‌లో శుక్రవారం వైఎస్సార్‌సీపీ బూత్‌లెవల్‌ ఏజెంట్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, బీఎల్‌ఓ జి.విష్ణుగౌతమ్‌తో పాటు పలు పార్టీల బీఎల్‌ఓలు సైతం ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు దరఖాస్తులు అందించారు. వారి జాబితా పరిధిలో ఆర్ముగం నగర్‌లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఆవుల నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల ఓట్లు జాబితాలో లేకపోవడాన్ని చూసి కంగుతిన్నారు. 30ఏళ్లుగా నాయుడుపేటలో ఉంటున్న ఆవుల నాగేశ్వరరావు 2002కు సంబంధించి ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో మ్యాపింగ్‌ చేయలేకపోయామని బీఎల్‌ఓ వెల్లడించారు. ఈ విషయమై ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు వారి పరిధిలోని ఓటర్ల జాబితాను పరిశీలన చేసుకుని ఓటు నమోదై ఉందే లేదో చూసుకోవాలని జలదంకి వెంకటకృష్ణారెడ్డి సూచించారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఇదే తరహాలో వృద్ధులు, పలువురు సీనియర్‌ ఓటర్లు సైతం జాబితాలో లేనట్లుగా గుర్తించారు.

కర్ణాటక సీఎంకు సాదర వీడ్కోలు

రేణిగుంట: తిరుమల తిరుపతి పర్యటన అనంతరం తిరుగు పయనమైన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌కి రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్‌ డా.ఎస్‌.వెంకటేశ్వర్‌, ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు, ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి సాదరంగా వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో కర్ణాటక సీఎం బెంగళూరు వెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement