నాయుడుపేట టౌన్: నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేటలో ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని దుండగులు చోరీ చేసిన ఘటనను శనివారం వెలుగులోకి వచ్చింది. అగ్రహారపేటలో తడ రత్నమ్మ, ఆమె కుమార్తె ప్రవళికతో కలిసి నివాసం ఉంటున్నారు. రత్నమ్మ పెద్ద కుమార్తె గూడూరు వైద్యశాలలో చికిత్స పొందుతోంది. రత్నమ్మతో పాటు ప్రవళిక సోమవారం గూడూరుకు వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వాళ్లు రత్నమ్మకు సమాచారం అందించారు. రత్నమ్మ ఇంటి వద్దకు చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని మూడు బీరువాలను ధ్వంసం చేసి అందులో దాచి ఉన్న సుమారు 3.5 సవర్ల బంగారు నగలు, అర కిలో పైగా వివిధ రకాల వెండి వస్తువులు, ప్రవళిక కిడ్డీ బ్యాంక్‌లో దాచుకుని ఉన్న రూ.15 వేల నగదును దుండగులు దోచుకెళ్లినట్టు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


