మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

● సాయికృష్ణ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలి ● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్‌

తిరుపతి కల్చరల్‌: మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పటి వరకు వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చిత్తూరు జిల్లా వాసి అయ్యి ఉండి కూడా మామిడి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. మామిడి కేజీకి రూ.15 నుంచి రూ.20 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కూటమి నేతలు కలిసి మామిడికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

సాయి కృష్ణ మృతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో చారణ జరిపించాలని, అలాగే సీబీఐతో విచారణ చేపట్టాలని నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. ఏబీసీడీ వర్గీకరణతో మాదిగలు, మాలలను విడదీసి చంద్రబాబు నాయుడు ఎవరికి మేలు చేశారో చెప్పాలన్నారు. తమిళనాడు తూతుకుడి పోలీస్‌ స్టేషన్‌లో తండ్రీ కొడుకులను హింసించిన కేసులో అదే పోలీస్‌ స్టేషన్లో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ ఇచ్చిన సాక్ష్యం మేరకు 9 మంది పోలీసు అధికారులకు మరణశిక్ష ఇదించారని గుర్తుచేశారు. కృష్ణలంక ఘటనలోనూ అదేవిధంగా విచారణ చేపట్టాలని కోరారు. సమావేశంలో అరే అజయ్‌కుమార్‌, వెంకటేష్‌, తాళ్లపాక మహేష్‌, నాగేంద్ర పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement