అక్రమ సంకెళ్లకు విముక్తి | - | Sakshi
Sakshi News home page

అక్రమ సంకెళ్లకు విముక్తి

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

● కామిరెడ్డికి బెయిల్‌ మంజూరు

– 8లో

తడ–నెల్లూరు మధ్య ఆరు లేన్లు
తడ–నెల్లూరు మధ్య ఉన్న నాలుగు లేన్ల స్థానంలో ఆరు లేన్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

పెళ్లకూరు: అక్రమ సంకెళ్లకు విముక్తి లభించింది. 96 రోజులపాటు అక్రమంగా జైళ్లలో నిర్బంధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డికి శుక్రవారం ఎట్టకేలకు బెయిలు మంజూరైంది. ధర్మమే గెలిచిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లకూరు మండలంలోని కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడాన్ని నిరసిస్తూ మార్చి 14న రైతులతో కలిసి వైఎస్సార్‌ సీసీ నాయకులు అడ్డుకున్నారు. దాంతో కూటమి నేతలు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా, డీసీసీబీ మాజీ చైర్మెన్‌ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డిలతో పాటు మొత్తం26 మందిపై కేసులు నమోదు చేశారు. సత్యనారాయణరెడ్డితో పాటు మరో 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు మార్చి 16న నెల్లూరు సబ్‌ జైలుకు తరలించారు. రిమాండ్‌లో ఉన్న ఆయన్ని మార్చి 24న పెళ్లకూరు పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. రిమాండ్‌లో ఉన్న మరో 12 మందికి ఏప్రిల్‌ 8న బెయిల్‌ మంజూరైంది. కానీ 11మందిని మాత్రమే విడుదల చేసిన పోలీసులు చెంబేడు గోదాము విషయంలో సత్యనారాయణరెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేసి రిమాండ్‌ను కొనసాగించారు. అలాగే చిల్లకూరులో జరిగిన వివాదానికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వివిధ సెక్షన్ల కింద సత్యనారాయణరెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేశారు. బెయిల్‌ మంజూరైన ప్రతిసారీ పలు పీటీ వారెంట్లు వేస్తూ రిమాండ్‌ నుంచి విడుదల కానివ్వకుండా గత 96 రోజులుగా జైలులో నిర్బంధించారు. చివరికి శుక్రవారం కామిరెడ్డికి బెయిల్‌ మంజూరైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement