పొగ‘దారి’! | - | Sakshi
Sakshi News home page

పొగ‘దారి’!

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

పై చిత్రంలో కనిపిస్తున్న దృశ్యంలో ఇక్కడేదో అగ్నిప్రమాదం జరిగిందనుకుంటే పొరపాటే. తిరుపతి–శ్రీకాళహస్తి జాతీయ రహదారి, ఏర్పేడు మండలం, మేర్లపాక సమీపంలోని ఓ స్టీల్‌ కర్మాగారం నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో కూడిన దట్టమైన పొగ ఇది. ముందు వెళ్లే వాహనాలు కనిపించకుండా రాత్రి వేళల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ పరిశ్రమ నుంచి నిత్యం చిమ్నీలు, ఇతర మార్గాల ద్వారా దట్టమైన విష వాయువులతో కూడిన పొగ వదులుతోంది. సమీప గ్రామాలలో ఇళ్ల డాబా మీద నల్లగా దుమ్ము పేరుకుపోతోంది. ఉన్నతాధికారులు స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. – ఏర్పేడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement