రెవెన్యూ..అమ్మో పనిభారం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ..అమ్మో పనిభారం

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

భర్తీ కాని ఖాళీ పోస్టులు ఉద్యోగోన్నతులు కల్పించడంలోనూ వెనుకబాటు మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు

మెరుగైన సేవలే లక్ష్యం

పుల్లంపేట: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని జిల్లా ఎస్పీ ఎల్‌ సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం ఆయన పుల్లంపేటలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్లంపేట, ఓబులవారిపల్లె, పెనగల రు, చిట్వేలి మండలాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా పుల్లంపేటలో సర్కిల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్‌ విధానంలో ఫిర్యా దుదారులు, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. మహిళల భద్రత, ఈవ్‌టీజింగ్‌ నివారణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియ మిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయం ప్రారంభించిన అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటా రు. సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐలతో కలిసి ఆయా స్టేషన్‌ల పరిధిలోని సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు వెంకటరావు, శ్రీనివాసులు, రవిమనోహరాచారి, రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు, రైల్వేకోడూరు సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐలు చిన్నరెడ్డెప్ప, సుజన్‌కుమార్‌, వినోద్‌కుమార్‌, అరుణ్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

జాబ్‌మేళాలో 271 మందికి ఉద్యోగాలు

తిరుపతి సిటీ: స్థానిక న్యూ బాలాజీ కాలనీలోని ఎస్‌డీహెచ్‌ఆర్‌ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌ మేళా మొత్తం 271 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బుధవారం జరిగిన జాబ్‌ మేళాలో దేశంలో పలు ఎమ్‌ఎన్‌సీ సంస్థల ప్రతినిధులు పాల్గొని, అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్‌ డీవీఎస్‌ చక్రవర్తిరెడ్డి మాట్లాడుతూ యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకుని అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు లక్ష్యంగా కళాశాల పనిచేస్తోందని తెలిపారు. ప్రిన్సిపల్‌ ఉష మాట్లాడుతూ ఎస్‌డీహెచ్‌ఆర్‌లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జాబ్‌ మేళాలో పాల్గొని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందిస్తూ, ఎంపిక కాని వారు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తొట్టంబేడు: మండలంలోని తంగేళ్లపాళెం సమీపంలో చైన్నె రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెండాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఐ బాలకృష్ణ కథనం మేరకు.. వరదయ్యపాళెం గ్రామానికి చెందిన అర్జున్‌((27)తోపాటు మరో యువకుడు శ్రీకాళహస్తి నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరారు. తంగేళ్ల పాళెం సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి అదే వాహనాన్ని ఢీకొని పడిపోయారు. అర్జున్‌ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. గాయవ మరో యవకుడిని శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

తిరుపతి అర్బన్‌: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో తమకు పనిభారం రోజు రోజు కూ పెరిగిపోతోందని రెవెన్యూ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల్లో 55శాతం పైగా రెవెన్యూ సమస్యలపైనే ఉంటున్నా యి. ఓ వైపు భూతగాదాలు, భూ ఆక్రమ ణలు, మరోవైపు పాస్‌ పుస్తకాల జారీ, సర్వే పనులు.. ఇలా పలు వాటితో తలమునకలై ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో సమస్యలు కొండవీటి చేంతాడులా పెరిగిపోతున్నాయి.మరోవైపు ఉద్యోగోన్నతుల ఊసే లేకపోవడంతో రెవెన్యూ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఖాళీగా ఉన్న తహసీల్దార్‌ పోస్టులను భర్తీ చేయకుండా రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉన్న డీటీలను ఇన్‌చార్జి తహసీల్దార్లుగా అధికారులపై ఒత్తిడి తెచ్చి నియమించుకుంటూ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు! దీంతో తహసీల్దార్లు మండల కేంద్రాల్లో కాకుండా కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రాధాన్యత లేని విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఇటీవల కోర్టు ఆదేశాలతో 200 మంది తహసీల్దార్లను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు జోన్లలో భర్తీ చేసినప్పటికీ ఇంకనూ 140 తహసీల్దార్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు తహసీల్దార్‌కు అర్హత ఉన్న డీటీలను రెగ్యులర్‌ తహసీల్దార్లుగా నియమించకుండా రాజకీయ నేతల పనులు చేయించుకోవడానికి ఇన్‌చార్జ్‌ పగ్గాలు మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు.

పని ఒత్తిడితో సతమతం

పని ఒత్తిడితో కొందరు గ్రామ రెవెన్యూ అధికారులు సతమతవుతున్నారు. శాఖకు సంబంధం లేని పనులు అప్పగించడం, సెలవు రోజుల్లో పనులు చెప్పడం, రాత్రి పగలు తేడా లేకుండా వివిధ బాధ్యతలు అప్పగిస్తుండడం మూలాన పనిభారంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుసార్లు రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేసినా, అధికారులకు వినతిపత్రాలను ఇచ్చినా పనిభారం మాత్రం తగ్గడం లేదు. పదుల సంఖ్యలో సర్వే పనులు అప్పగిస్తుండడంతో మింగలేక కక్కలేక చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కలెక్టరేట్‌ వరకు ఖాళీగా ఉన్న రెవెన్యూ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అర్హులైన అందరికీ ఉద్యోగోన్నతులు కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమించక తప్పదనే చర్చ ఉద్యోగుల్లో నడుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement