● రూ.50 వేల నగదు, 8 గ్రాముల బంగారం బుగ్గిపాలు
చంద్రగిరి: షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసె దగ్ధమైన ఘటన మండలంలోని తాటికోన ఎస్టీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. తాటికోనకు చెందిన సురేష్, అంజలి దంపతులు ముగ్గురు పిల్లలతో కలసి సమీపంలోని ఓ మామిడి తోట లో కాపలాదారులుగా ఉంటున్నారు. ఈ క్ర మంలో రోజూలాగా బుధవారం దంపతులు ఇద్దరు పిల్లలను తీసుకుని తోటకు వెళ్లారు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యా పించి గుడిసె కాలిపోయింది. ఈ ప్రమాదంలో బాధితులు డ్వాక్రా సంఘం కో సం ఉంచుకున్న రూ.50 వేల నగదు, 8 గ్రా ముల బంగారం, ఆధార్‌కార్డు, దుస్తులు, గృహపకరణాలు మంటలకు ఆహూతయ్యాయి.
ఆటోవాలాల ముష్టి యుద్ధం
చంద్రగిరి: మండల కేంద్రంలో ప్రయాణికులను ఎక్కించుకునే విషయమై ఆటోవాలాలు నడిరోడ్డుపై బుధవారం బాహాబాహీకి దిగి కొట్టుకున్నారు. వివరాల్లోకెళితే.. చంద్రగిరి పోలీసు స్టేషన్ సమీపంలోని జెరాక్స్ సెంటర్‌కు ఓ ఆటో డ్రైవర్ భార్య తన కుమారుడితో కలసి వచ్చి, పత్రాలను జెరాక్స్ చేసుకుంది. ఆపై మహిళ బయటకు రాగానే అక్కడ ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఓ ఆటో సిద్ధంగా ఉంది. అయితే సదరు మహిళ ఆ ఆటో ఎక్కకుండా, వెనుక ఉన్న తన భర్త ఆటో ఎక్కింది. ఆ ఆటో లో డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాడని అపోహకు గురైన ఆటో డ్రైవర్ అతనితో గొడవకు దిగారు. ఈ క్రమంలో మహిళ ఇది త మ ఆటో అని, ఆయన తన భర్త అంటూ చెప్పింది. అయినప్పటికీ వినిపించుకోని మరో ఆటో డ్రైవర్ ఆ మహిళ భర్తపై దాడికి దిగాడు. తన భర్తపై మరో ఆటో డ్రైవర్ దాడి చేశారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన వ్యక్తి స్థానికంగా ఉండే కాలనీకి చెందిన బా షా అని మహిళా పేర్కొంది. ఇరువర్గాల గొ డవల నేపథ్యంలో స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
వడదెబ్బతో మహిళ మృతి
ఏర్పేడు: మండలంలోని రాజుల కండ్రిగ గ్రామానికి చెందిన సూరపరాజు సుభద్రమ్మ(62) బుధవారం మధ్యాహ్నం వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వ్యవసాయ కూలీలకు భోజనం తీసుకెళ్లి, పొలాల నుంచి తిరిగి వస్తుండగా ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి పంట పొలంలోనే కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
బంగారు ఆభరణాలు, నగదు చోరీ
దొరవారిసత్రం: వేణుంబాకం గ్రామ పరిధిలోని మాతమ్మ, చింతాలమ్మ ఆలయాల్లో గుర్తుతెలియని దుండగలు చొరబడి బంగారు ఆభరణాలు, నగదుతోపాటు వెండి ఆభరణాలు మంగళవారం రాత్రి చోరీ అయ్యాయి. స్థానిక పోలీసుల కథనం మేరకు.. వేణుంబాకం ఎస్సీ కాలనీలో మాతమ్మ గుడి తాళాలు పగుల గొట్టి అమ్మవారి మెడలోని బంగారు తాళిబొట్లు, కాసులు, గుండ్లుతో పాటు అక్కడే ఉన్న బీరువా తాళం బద్దల కొట్టి వెండి వస్తువులు కొన్ని చోరీ చేశారు. హుండీలోని నగదును చోరీ చేశారు. మూడున్నర సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. అలాగే గ్రామ పొలిమేర్లలో ఉన్న ముత్యాలమ్మ గుడి తాళాలు కూడా పగులగొట్టి అమ్మవారి మెడలోని తాళి బొట్లను అపహరించారు. ఈ చోరీ చోరీలపై ఆయా ఆలయాల పూజార్లు గూడూరు భూషణమ్మ, మంగళం అల్లెయ్య బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జీవీ చౌదరి తెలిపారు. పాళెంపాడులోని మాతమ్మ ఆలయంలో కూడా ఆలయ తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని దుండగలు చోరీకి యత్నించారు.
పిడుగుపాటుకు రైతు మృతి
తొట్టంబేడు: మండలంలోని కాసరం గ్రామానికి చెందిన ఓ రైతు బుధవారం రాత్రి పిడుగుపాటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన కే శ్రీనివాసులు(45) పొలానికి వెళ్లి, మరో ముగ్గురు కూలీలతో ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో గాలి మొదలైంది. శ్రీనివానులు సమీపంలో పిడుగు పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తప్పించుకున్నారు. మృతునికి భార్య, కుమారుడు, ఆరు నెలల కుమార్తె ఉన్నారు.


