రేణిగుంట: జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డితో కలిసి రేణిగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 10 నుంచి 15 రోజులు తోతాపురి సీజన్‌లో అత్యంత కీలకమైన కాలమని పేర్కొ న్నారు. రైతులు పక్వానికి రాని కాయలను కోయకుండా, పూర్తిగా పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోసి విక్రయించాలని సూచించారు. మామిడి కిలోకు రూ.6 కంటే తక్కువ ధర చెల్లించే యూనిట్లు ఎక్కడైనా ఉంటే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.


