తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల నూతన ఆవిష్కరణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో బుధవారం జరిగిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో నిర్వహించిన ఉత్తమ రూపకల్పనల ప్రదర్శనలో శ్రీరామ కళాశాలలో మూడో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న అమన్ విద్యార్థి రూపొందించిన ఇన్‌ఫ్రాబాట్ అనే రోబోటిక్ వ్యవస్థ ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికై ంది. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇన్నోవేషన్ హబ్ ప్రదర్శనను సందర్శించి విద్యార్థి అమన్ రూపొందించిన రోబోటిక్ వ్యవస్థను ఉత్తమ ఆవిష్కరణగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి రూపొందించిన ఆవిష్కరణ ఆర్‌టీఐహెచ్‌కి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను తనిఖీ చే యడం, పర్యవేక్షించడంతోపాటు అ డ్డంకులను తొలగించడం కోసం త మ విద్యార్థి అమన్ రూపొందించిన రో బోటిక్ వ్యవస్థ ఎంతో ఉపయోగకర మన్నారు. కళాశాల రీసెర్చ్ డెవలప్‌మెంట్ నిర్వాహకులు, విద్యార్థికి, కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ కే జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వాసు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.


