రెండు కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రెండు కిలోల గంజాయి స్వాధీనం

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

– నిందితుడి అరెస్టు

సత్యవేడు: ఓ వ్యక్తి వద్ద రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, అతడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ లావణ్య తెలిపారు. సత్యవేడు మండలంలోని ఇంద్రాపురం సమీపంలో ఎస్‌ఐ లావణ్య ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వ్యక్తి పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న సంచిని పరిశీలించగా రెండు కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు డీసీ సుధాకర్‌(26)ను అరెస్టు చేశారు. విచారణలో చైన్నె నుంచి గంజాయి తెచ్చి శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపాడు. రెండు రోజుల క్రితం కొత్తమారికుప్పం గిరిజన కాలనీ పాఠశాలలో రెండోతరగతి చదువుతున్న ఇద్దరు బాలికలను బాత్‌రూమ్‌లో లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఇతడే అని పోలీసులు గుర్తించారు. బుధవారం సాయంత్రం నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement