పారదర్శకత ప్రశార్థకమేనా? | - | Sakshi
Sakshi News home page

పారదర్శకత ప్రశార్థకమేనా?

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

● స్వర్ణముఖి నదిలో రహదారి ఏర్పాటు ● పట్టించుకోని అధికారులు – 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ఎస్వీ, పద్మావతి, ద్రావిడ వర్సిటీల్లో అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి, భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్వర్ణముఖిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు

అక్రమార్కులకు పచ్చనేతల అండ

బుధవారం శ్రీ 17 శ్రీ జూన్‌ శ్రీ 2026

అక్రమమా..సక్రమమా.. తరువాత సంగతి. గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టాలన్నట్లుంది ఇసుకాసురుల సంగతి. నాయుడుపేట మండలంలోని స్వర్ణముఖి నది పొడువునా ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతో కొందరు స్వర్ణముఖిలో బాటలు ఏర్పాటు చేసుకుని, ఉచితం పేరుతో ఇసుకను ఊడ్చేస్తున్నారు. ఫలితంగా నదిలో అగాధాలు ఏర్పడుతున్నాయి.

అయ్యప్పరెడ్డిపాళెం వద్ద స్వర్ణముఖి నదిలో ట్రాక్టర్లకు ఇసుక లోడ్‌ చేస్తున్న అక్రమార్యులు

నాయుడుపేటటౌన్‌: ఇసుక ఉచితం పేరుతో నాయుడుపేట మండలంలోని స్వర్ణముఖి నదిని ఇసుకాసురులు ఊడ్చేస్తున్నారు. అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమంగా తవ్వి, తరలిస్తున్నారు. మండలంలోని ఏల్‌ఏ సాగరం, బీడీ కాలనీ, భీమవరం మర్లపల్లి, అన్నమేడు, అయ్యప్పరెడ్డిపాళెం, కల్లిపేడు, మూర్తిరెడ్డిపాళెం తదితర గ్రామాల్లో చాలా చోట్ల స్వర్ణముఖి నది పొర్లు కట్టలను ధ్వంసం చేశారు. ఇసుక అక్రమ తరలింపునకు ట్రాక్టర్లు రాకపోకలు జరుపుకునేలా తవ్వేశారు. పట్టణ పరిధిలోని ఎల్‌ఏ సాగరం బీడీ కాలనీ పమీపంలో అగ్నిమాపక శాఖ కార్యాలయం ముందున్న రహదారి వద్ద నుంచి ప్వర్ణముఖి నది వద్దకు వచ్చే ట్రాక్టర్ల కోసం నది మధ్యలో ఏకంగా దారి ఏర్పాటు చేసుకున్నారు. ఇసుక ఉచితం పేరుతో అధికార పార్టీ నేతల అండతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇంటి అవసరాల పేరుతో కొంత తరలిస్తూ అధికంగా తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు, పరిశ్రమలతోపాటు ఇసుక డంపింగ్‌ యార్డులకు, కాంక్రీట్‌ మిక్స్‌ర్‌ ఫ్లాంట్‌లకు తరలించి, అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా మండలంలోని పలు ప్రాంతాల్లో ఇసుకను డంపింగ్‌ చేసుకుని, రాత్రి సమయాల్లో టిప్పర్లు, లారీల్లో తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపులపై తమకేమి సంబంధం లేదిని పలు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో స్వర్ణముఖి నదిలో తాగునీటి పథకాలకు సంబంధింరచిన బోర్లతోపాటు వ్యవసాయ బోర్లు పైపులైన్లను సైతం ఇఽసుక అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారని రైతులు అందోళనలు చెందుతున్నారు. ఇప్పటికై నా జిల్లా మైనింగ్‌, ఇరిగేషన్‌ తదితర శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, స్వర్ణముఖి నది నుంచి జరిగే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

మర్లపల్లి సమీపంలో రాత్రి వేళ టీడీపీ నాయకుల ఫొటోలతో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement