వర్సిటీల్లో అధ్యాపకపోస్టుల నియామక ప్రక్రియ యూజీసీ నిబంధనలకు అనుగుణంగా జరగాలి. పరీక్ష తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూల విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలి. స్పోర్ట్స్ డీఎస్సీలా గందరగోళం సృష్టిస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదు.
– బండి చలపతి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి
పారదర్శకత లోపిస్తే తిరుగుబాటు
యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే తిరుగుబాటు తప్పదు. అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. మెరిట్ అభ్యర్థులకు పోస్టులు దక్కాలి. ప్రభుత్వం తప్పటడుగు వేస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు.
– అశోక్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు
దగా చేస్తే ఊరుకోం
వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు పారదర్శకంగా చేపట్టాలి. పేపర్ లీకేజులు, ఇంటర్వ్యూలలో పక్షపాతం వంటి వాటికి తావులేకుండా పకడ్బందీగా నియామక ప్రక్రియ చేపట్టాలి. స్పోర్ట్ డీఎస్సీలా దగా చేస్తే ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల ఆగ్రహానికి గురికాకతప్పదు.
– ప్రేమ్ కుమార్,
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షులు


