పారదర్శకత ప్రశార్థకమేనా? | - | Sakshi
Sakshi News home page

పారదర్శకత ప్రశార్థకమేనా?

Jun 17 2026 12:10 AM | Updated on Jun 17 2026 12:10 AM

ఒక్కో పోస్టుకు 157 మంది పోటీ

నివ్వెరపోతున్న అధికారులు

భర్తీ పారదర్శకంగా చేపట్టాలి

స్పోర్ట్స్‌ డీఎస్సీలా చేస్తే సహించేది లేదు

ఉన్నత విద్యామండలికి విద్యార్థి సంఘాల హెచ్చరిక

తిరుపతి సిటీ: జిల్లాలోని ఎస్వీయూ, పద్మావతి మహిళా వ ర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తా యి. ఆయా వర్సిటీల్లో పలు అధ్యాపక పోస్టుల భర్తీ కోసం ఉన్నత విద్యామండలి ఆహ్వానించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సోమవారంతో గడువు ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నా రు. ఒక్కో పోస్టుకు 157 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నియామకాలు పారదర్శకంగా జరపాలని అవినీతికి పాల్పడినా, రోస్టర్‌ విధానం సక్రమంగా అమలు చేయకపోయినా, యూజీసీ నిబంధనలకు మేర ని యామకాలు చేపట్టక పోయినా విద్యార్థి సంఘాల ఐక్యవేది క ఆధ్వర్యంలో ప్రతిఘటించి ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. స్పోర్ట్స్‌ డీఎస్సీలా గా యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల నియామకాల్లో గందరగోళం సృష్టిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు.

125 పోస్టులకు 19,588 దరఖాస్తులు

ఎస్వీయూలో 125 పోస్టులకు ఆల్‌లైన్‌ ద్వారా రికార్డు స్థాయిలో 19,588 దరఖాస్తులు అందినట్లు సమాచారం. దాదాపు 1:157 నిష్పత్తిలో పోటీ నెలకొన్నట్లు గణాంగాలు చెబుతున్నాయి. కుప్పం ద్రావిడ వర్సిటీలో 20 పోస్టులకు 2,792 దరఖాస్తులు అందాయని అధికారులు వెల్లడించారు. మహిళా వర్సిటీలో 48 పోస్టులకు సైతం అదే రీతిలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు సమాచారం. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఈనెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. జూలై 6వ తేదీ వ రకు అభ్యంతరాల స్వీకరించి, అదే నెల 7వ తేదీన అర్హత పొందిన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు.

నిరుద్యోగులతో ఆటాడుకోవద్దు

ఎన్నో సంవత్సరాల తర్వాత యూనివర్సిటీలలో పలు అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియ జరుగుతోంది. ఎస్వీయూలోనే 125 పోస్టులకు సుమారు 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారంటే పోటీ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆశతో ఉన్నారు. వారి జీవితాలతో ఆడుకోకుండా అధ్యాప నియామకాలలో అవినీతి ఆస్కారం లేకుండా పారదర్శకంగా చేపట్టాలి.

– శివశంకర్‌ నాయక్‌, జీఎన్‌ఎస్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు

రాజకీయ జోక్యాన్ని నివారించాలి

వర్సిటీలలో త్వరలో చేపట్టబోయే అధ్యాపక నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నివారించాలి. రాజకీయ నాయకులు జోక్యంతో ప్రతిష్టాత్మక నియామకాల ప్రక్రియ భ్రష్టుపడుతోంది. పోటీ పరీక్షలో అభ్యర్థి సాధించిన మెరిట్‌తో పాటు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలి.

–ఆర్‌ ఆశ, పీడీఎస్‌ఓ, జిల్లా కార్యదర్శి

పోటెత్తిన దరఖాస్తులు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement