డిగ్రీ, పీజీ ఫలితాలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ, పీజీ ఫలితాలు విడుదల చేయాలి

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో 5 నెలలకు కిందట నిర్వహించిన డిగ్రీ ఐదో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను, పెండింగ్‌లో ఉన్న పీజీ ఫలితాలను తక్షణం విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రెక్టార్‌ అప్పారావును కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్వీయూలో ఎగ్జామినేషన్‌ సెక్షన్‌ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఎంతో మంది ఇబ్బందులకు గురికావల్సి వస్తోందన్నారు. సకాలంలో పీజీ, యూజీ పరీక్షల ఫలితాలను విడుదల చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న పరీక్షల ఫలితాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై రెక్టార్‌ స్పందిస్తూ రెండు రోజులలో డిగ్రీ ఫలితాలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు అశోక్‌, తేజ, వినోద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement