అర్హులందరికీ రూఫ్‌ టాప్‌ సోలార్‌ | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ రూఫ్‌ టాప్‌ సోలార్‌

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

తిరుపతి రూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారుల గృహాలపై రూఫ్‌ టాప్‌ సోలార్‌ సిస్టమ్స్‌ను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో సోమవారం సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 63 మంది వినియోగదారులు తమ విద్యుత్‌ సమస్యలను సీఎండీకి వివరించారు.

ముగిసిన జాతీయ సదస్సు

తిరుపతి సిటీ: పాలేఖర్‌ కృషి విజ్ఞాన కేంద్రం, రైతు నేస్తం సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వీయూ బోటనీ విభాగం సహకారంతో ఐదు రోజులుగా జరిగిన ప్రకృతి వ్యవసాయంపై జాతీయ సదస్సు సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహిత సుభాష్‌ పాలేఖర్‌ పాల్గొని విద్యార్థుల, వ్యవసాయ రంగ నిపుణల సందేహాల ప్రశ్నోత్తరాలను నివృతి చేశారు. అనంతరం సదస్సులో ఐదు రోజుల పాటు శిక్షణ పొందిన విద్యార్థులకు, ఔత్సాహికులకు ధ్రువపత్రాలు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement