రేణిగుంట: భారత ఎన్నికల కమిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ రేణిగుంట మండలంలో తూతూ మంత్రంగా మొదలైంది. ఎన్నికల కమిషన్, ఉన్నత అధికారులు చేసిన ప్రకటనల ప్రకారం సోమవారం నుంచి ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు వివిధ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు సమాచారం అందించి సర్ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. కానీ రేణిగుంట మండలంలో అనేక గ్రామాలకు సాయంత్రం వరకు వాటికి సంబంధించిన ఫామ్‌లు రాలేదని బీఎల్వోలు తెలపడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను అంత పారదర్శకంగా నిర్వహించాలని చెబుతున్న స్థానికంగా ఆ పరిస్థితులు కనిపించ లేదు. అనేక చోట్ల అధికార పార్టీ వారు చెప్పినట్లు బీఎల్వోలు ప్రవర్తిస్తున్నారని, ఇతర పార్టీల వారు ఆరోపిస్తున్నారు. మండలంలో 80 శాతానికి పైగా మొదటి రోజు ప్రక్రియ ఎక్కడ మొదలు కానప్పటికీ అధికారులు మాత్రం మొదటి రోజు ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయంపై తహసీల్దార్ శ్రావణ్‌కుమార్‌ని వివరణ కోరగా సర్ ప్రక్రియ మొదలైందన్నారు.
అంతర్జాతీయ శిక్షణకు తొట్టంబేడు టీచర్
తొట్టంబేడు: మండలంలోని దిగువ సాంబయ్యపాళెంలోని ఫౌండేషన్ స్కూల్ ఉపాధ్యాయుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం ఫిన్‌లాండ్‌లో జరిగే అంతర్జాతీయ శిక్షణకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో అమరావతిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో బాలు పాల్గొన్నారు. ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు టీచర్లు ఫిన్లాండ్‌లోని తుర్కు, రౌమా నగరాల్లో పర్యటించి అక్కడి బోధన విద్యా విధానాలను పరిశీలిస్తారు.


