– పీజీఆర్‌ఎస్‌కు 461 అర్జీలు
తిరుపతి అర్బన్: న్యాయం కోసం పేద కుటుంబాలకు చెందిన పలువురు కలెక్టరేట్ వద్ద పీజీఆర్‌ఎస్ సందర్భంగా ధర్నాలు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 461 అర్జీలు వచ్చాయి. జేసీ గోవిందరావుతోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్‌నాయక్, భరత్ నాయక్, రోజ్‌మాండ్ అర్జీలను స్వీకరించారు. గ్రామ పంచాయతీ, స్వచ్ఛభారత్, క్లాప్ మిత్ర కార్మికుల సమస్యలను పట్టించుకోరా? అంటూ ఆ విభాగాలకు చెందిన వర్క ర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. డీపీఓ సుశీలాదేవికి వినతిపత్రం అందజేశారు. వెంకటగిరి మండలం జంగాలపల్లి చెరువులో ఆక్రమణకు తొలగించాలని గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లికి చెందిన పంట కాలువలను ఆక్రమించి పూడ్చేస్తున్నారని గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. తిరుచానూరులోని సర్వే నంబర్ 252–2ఏ1లో 10 సెంట్లు, 252–3ఏ1లో 18 సెంట్లు ఆక్రమించారని బాధితురాలు డి.జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.


