తిరుపతి అర్బన్: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై జాలి చూపడం కన్నా...వారి ప్రతిభను, సామర్థాన్ని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారని జాయింట్ కలెక్టర్ గోవిందరావు అభిప్రాయపడ్డారు. సోమవారం తిరుపతి బైరాగిపట్టెడలోని ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్ వద్ద అలింకో ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా వివిధ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జేసీ మాట్లాడుతూ 3–18ఏళ్ల లోపు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు భవిత కేంద్రాల్లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ అలింకో ఆధ్వర్యంలో 499 మంది విద్యార్థులకు రూ.45 లక్షలు విలువ చేసే వివిధరకాల ఉపకరణాలను అందించినట్లు తెలిపారు. సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.65లక్షల వ్యయంతో వివిరకాల భత్యాలను అందిస్తున్నట్లు చెప్పారు.


