అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

తిరుపతి క్రైం: నగరంలోని సంజయ్‌ గాంధీ కాలనీలో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ఈతమాకుల వడ్డిపల్లికి చెందిన పి.భానుప్రకాష్‌ (26) మూడేళ్ల కిందట తిరుపతికి చెందిన వి.నాగవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ దంపతులు తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల భానుప్రకాష్‌ తన తల్లిని కలిసేందుకు వెళ్లే విషయంలో భార్యతో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తిరుపతిలోని తన నివాసంలో భానుప్రకాష్‌ చీరతో ఉరివేసుకుని మృతి చెందాడు. తన కుమారుడి మ రణంపై అనుమానాలు ఉన్నాయని, విచారణ జరపాలని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement