వెంకటగిరి రూరల్: విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతు చేస్తున్న జేఎల్‌ఎం విద్యుత్‌షాక్ గురై స్తంభం పైనుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన డక్కిలి మండలం లింగసముద్రం ఫీడర్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. లింగసముద్రం సచివాలయంలో పోలి పోతన జేఎల్‌ఎంగా పనిచేస్తున్నారు. శనివారం మోపూరు రోడ్డు సబ్‌స్టేషన్ పరిధిలోని లింగసముద్రం ఫీడర్‌లో విద్యుత్ స్తంభం పైకి ఎక్కి లైన్ మరమ్మతు చేస్తుండగా 11కేవీ విద్యుత్ సరఫరా కావడంతో పోతన షాక్‌కు గురై కింద పడి, తీవ్రంగా గాయపడ్డాడు. తోటి ఉద్యోగులు, స్థానికులు పోతనను చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
చికిత్స పొందుతున్న పోతన


