వేడుకగా సహస్ర దీపాలంకరణ సేవ | - | Sakshi
Sakshi News home page

వేడుకగా సహస్ర దీపాలంకరణ సేవ

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

తిరుమల: తిరుమలలో వేంకటేశ్వర స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన వి ద్వాంసురాలు శోభారాజు తన శిష్య బృందంతో కలిసి భక్తి గీతాలాపన చేశారు. గాత్ర సహకారాన్ని అభిరామ్‌, మానస పటేల్‌ అందించగా, వాయిద్య సహకారాన్ని కీబోర్డుపై కళ్యాణ్‌, తబలాపై పాండు అందించారు. అనంతరం ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించగా, శో భారాజు దంపతులకు, కళాకారులకు స్వామి వారి హారతి, తీర్థప్రసాదాలు అందజేశారు.

కాళంగి నదిలో పడి పశువుల కాపరి మృతి

బుచ్చినాయుడుకండ్రిగ: కాటూరు సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లి కాళంగి నదిలోని గుంతలో పడి పశువుల కాపరి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కా టూరు దళితవాడకు చెందిన అక్కులయ్య (66) పశువుల కాపరిగా పనిచేస్తూ, జీవనం సాగిస్తు న్నాడు. ఈ నెల 11వ తేదీన అక్కులయ్య కాళంగి నది సమీపంలో పశువులను మేతకు తీసుకె ళ్లాడు. సాయంత్రానికి పశువులు ఇంటికి వచ్చేశా యి. అక్కులయ్య రాకపోవడంతో కుటుంబ స భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాళంగినదిలో అక్కులయ్య కోసం గాలించినా కనిపించకపోవడంతో వచ్చేశారు. శనివారం ఉదయం అ క్కులయ్య శవం నీటిలో తేలుతూ కనిపించడంతో పోలీసులకు తెలిపారు. మృతదేహన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.

గోడౌన్‌లో అగ్నిప్రమాదం

సూళ్లూరుపేట: తడ మండలం పూడి గ్రామం వద్ద చెక్కలు నిల్వ చేసిన గోడౌన్‌లో శనివారం ఉన్నట్టుండి మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో గోడౌన్‌లోని చెక్కలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట సీఐ ఎం మురళీకృష్ణ, ఎస్‌ఐ కొండపనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement