వాయులింగేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

వాయులింగేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవులు, శని త్రయోదశి సందర్భంగా స్వామి అమ్మవార్లను సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన సేవల్లో 986 మంది భక్తులు పాల్గొనగా, వాటి ద్వారా రూ.3,28,248 ఆదాయం లభించింది. శనివారం త్రయోదశి సందర్భంగా అత్యధికంగా 495 మంది శనీశ్వర స్వామి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. వివిధ టికెట్ల విక్రయం ద్వారా రూ.54,91,250 ఆదాయం సమకూరింది. శీఘ్ర దర్శనం, ప్రత్యేక, అంతరాలయ దర్శనాలతో రూ.11,23,850 ఆదాయం వచ్చింది. లడ్డూలు, వడలు, పులిహోర తదితర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.4,39,030 ఆదాయం లభించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement