రైల్వేస్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌ తనిఖీ

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: సౌత్‌ కోస్ట్‌ రైల్వే (ఎస్సీఓఆర్‌) జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథూర్‌ శనివారం తిరుపతి రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. విజయవాడ, గూడూరు, తిరుపతి రైల్వే మార్గంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పన్చుజీ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గుంతకల్‌ రైల్వే డివిజన్‌ అధికారులు నిర్వహించిన సమగ్ర ప్రజెంటేషన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్‌ కోస్ట్‌ రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎస్‌కే రాజ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సిగ్నల్‌, టెలికాం ఇంజినీర్‌ ఓబీ సురేష్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వినీత్‌ కుమార్‌, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ అంకుష్‌ గుప్త, గుంతకల్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ చంద్రశేఖర్‌ గుప్త, తిరుపతి స్టేషన్‌ డైరెక్టర్‌ కుప్పాల సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement