17న ఎస్‌డీహెచ్‌ఆర్‌లో మెగా జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

17న ఎస్‌డీహెచ్‌ఆర్‌లో మెగా జాబ్‌మేళా

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

తిరుపతి సిటీ: నగరంలోని న్యూ బా లాజీ కాలనీలో ఉన్న ఎస్‌డీహెచ్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 17 వ తేదీ ఉదయం 10 గంటలకు మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ఉమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాకు 2021–26 వరకు ఉత్తీర్ణులైన బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీజెడ్‌సీ, బీసీసీ ఏ, బీబీఎం, బీసీఏ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. మేళాలో సజిలిటీ, సదర్లాండ్‌, ఫస్ట్‌సోర్స్‌, అలోరికా, అప్తారా, టెలిపెర్ఫార్మెన్స్‌, ఒమేగా హెల్త్‌కేర్‌, ఆ టోసెన్స్‌, పేస్‌, ఆల్‌సెట్‌, కాల్క్‌లైట్‌ టె క్నాలజీస్‌ తదితర ఎమ్‌ఎన్‌సీ సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తా యని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు 7989004486, 9490557045 నంబర్లను సంప్రదించాలని కోరారు.

రక్తదానం చేసి,

ప్రాణదాతలు కండి

తిరుపతి తుడా: ఆరోగ్యవంతులైన యువత ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం స్విమ్స్‌ ఇమ్యూనో హెమటాలజీ, ట్రాన్స్‌ ఫ్యూజన్‌ మెడిసిన్‌ (బ్లడ్‌ సెంటర్‌) విభాగం సంయుక్త ఆధ్వర్యంలో పద్మావతి ఆడిటోరియంలో ప్ర పంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయ న ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న 18–60 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి అర్హులన్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శిల్పా కడియాల, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శరన్‌ బి సింగ్‌ , ఆర్‌ఎంఓ డాక్టర్‌ సతీ ష్‌, బ్లడ్‌ సెంటర్‌ విభాగాధిపతి డాక్ట ర్‌ శ్రీధర్‌ బాబు, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ పాల్గొన్నారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement