తిరుమల/శ్రీకాళహస్తి: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అలాగే జానపద గాయకుడు గోరంట్ల వెంకన్న కూడా శనివారం తిరుమలేశుని దర్శించుకున్నారు.
ముక్కంటి సేవలో జస్టిస్ బీఆర్ గవాయ్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కుటుంబ సమేతంగా శనివారం శ్రీకాళహస్తికి చేరుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు.


