రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

– వైఎస్సార్‌ సీపీ నేత ఇంట విషాదం

రామచంద్రాపురం: మండలంలోని టీవీ సఫార్ల గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌(30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి గుండొడుకనం కొత్త రోడ్డులో రోడ్డు పక్కన పడి ఉన్న అనిల్‌కుమార్‌ను అటువైపుగా వెళుతున్న వాహనచోదకులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. మోటారు సైకిల్‌లో వెళుతూ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య శ్రావణి, కుమారుడు కేశవనంద, కుమార్తె వి మోక్షిత ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ ఏవీ బ్రహ్మానందం రెడ్డి శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement