తొలివిడత కౌన్సెలింగ్‌ నేటితో పూర్తి | - | Sakshi
Sakshi News home page

తొలివిడత కౌన్సెలింగ్‌ నేటితో పూర్తి

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి మహిళా జూనియర్‌ కళాశా లల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారంతో ముగియనుంది. తొలివిడతలో భా గంగా శుక్రవారం జరిగిన కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఎస్వీ జూనియర్‌ కళాశాలలో 40 మంది విద్యార్థులు, పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలలో 60 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలు పొందినట్లు అధికారులు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

మహిళా వైద్యకళాశాలలో రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీలు

తిరుపతి తుడా: స్విమ్స్‌ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఫిజియాలజీ విభాగం ఆధ్వర్యంలో 7వ రాష్ట్రస్థాయి హయగ్రీవ–2026 క్విజ్‌ పోటీలు ఘనంగా నిర్వహించారు. గురువారం పద్మావతి వైద్య కళాశాల లెక్చర్‌ గ్యాలరీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు వైద్యకళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీలు నిర్వహించామన్నారు. వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఫిజియాలజీ విభాగం ఏడేళ్లుగా హయగ్రీవ క్విజ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృత్తి పరమైన మెలకువలు తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీన్‌ డాక్టర్‌ అలోక్‌ సచన్‌, విభాగాధిపతి డాక్టర్‌ శరణ్‌ బి సింగ్‌, పార్మాకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఉమామహేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్వీయూలో చిరుత కలకలం

తిరుపతి సిటీ: ఎస్వీయూలోని పలు ప్రాంతాల్లో చిరుత సంచరించడం కలకలం రేపింది. వర్సిటీలోని కామర్స్‌ విభాగం చొప్పుల రత్నం భవనం పరిసరాలు, పురుషుల హాస్టల్స్‌ ఐ, జీ బ్లాక్‌ సమీపంలో గురువారం రాత్రి సంచరించడంతో అటు విద్యార్థులు, ఉద్యోగులు భయబ్రాంతులకు గురయ్యారు. వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు చిరుత సంచరించే ప్రాంతానికి చేరుకునేలోపు చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టి చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ గోగర్భం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 75,428 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement