వెంకటగిరి రూరల్: రెండు నెలల పసికందు మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ ఘటన వెంకటగిరిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. వెంకటగిరి మండలంలోన చింతగుంట గ్రామానికి చెందిన లంకా సాయి, రత్నమ్మ దంపతులకు రెండు నెలల శిశువు ఉన్నాడు. ఆ శిశువు అనారోగ్యానికి గురికావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలను సంప్రదించగా వైద్యులు ఇంజక్షన్ వేసిన గంటల వ్యవధిలో ఆ చిన్నారి మృతి చెందాడు. దీంతో వైద్యం వికటిచడంతో తమ బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆందోళన చేశారు. దీంతో చిన్నారి మృతదేహంతో స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయబోయారు. మృతి చెందిన చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించాలని పోలీసులు తెలపడంతో రెండునెలల పసికందును పోస్టుమార్టం చేయడం ఇష్టం లేక తల్లిదండ్రులు వెనుతిరిగారు.


