రేణిగుంట: సీఎంతోపాటు డిప్యూటీ సీఎం, మంత్రులకు రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు సాదర స్వాగతం, వీడ్కోలు పలికారు. తిరుపతి జిల్లా ఒక రోజు పర్యటన నిమిత్తం శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేర్వేరుగా వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో జిల్లా అధికార యంత్రాంగం సాదరంగా స్వాగతం పలికారు. తిరుపతి కార్యక్రమం అనంతరం తిరిగి ప్రయాణమైన వారికి సాదరంగా వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


