వెంకటగిరి రూరల్ : మండలంలోని వల్లివేడు సమీపంలో ఉన్న 9వ బెటాలియన్‌ను ఏపీఎస్పీ బెటాలియన్ల ఐజీపీ బి రాజకుమారి శుక్రవారం సందర్శించారు. బెటాలియన్‌లో పేరేడ్ గ్రౌండ్‌లో నూతనంగా నిర్మించిన పోర్టు వాల్‌ను ప్రారంభించారు. అనంతరం యూనిట్ అధికారులతో ప్రజా దర్భార్ నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. బెటాలియన్‌లోని యూనిట్ వైద్యశాల, బ్యారక్స్, హాస్టల్ పరిశీలించారు. అనంతరం బెటాలియన్‌లో ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందు బెటాలియన్‌కు విచ్చేసిన ఐజీపీ బిరాజకుమారిని కమాండెంట్ ఈఎస్ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి, గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్, బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.


