సాక్షి టాస్క్‌ఫోర్స్/శ్రీకాళహస్తి: పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఓ తెలుగు దేశం పార్టీ నాయకుడికి చెందిన మద్యం దుకాణం వద్ద కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభకు వెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. సభకు తరలించే ముందు వచ్చిన వారికి మద్యం పంపిణీ చేసి, అనంతరం బస్సుల్లో ఎక్కించి సభకు పంపించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అలాగే ఏపీ సీడ్స్ గోడౌన్ సమీపంలోని మరో మద్యం దుకాణం వద్ద కూడా నాలుగు బస్సులను సిద్ధం చేసి, అక్కడికి వచ్చిన వారికి మద్యం, బిర్యానీతో పాటు ఖర్చుల కోసం నగదు అందజేసి సభకు తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం, బిర్యానీ, నగదు పంపిణీ ద్వారా సభకు జనాలను సమీకరించారని స్థానికంగా విమర్శలు వ్యక్తం అయ్యాయి.


