ఇది మంత్రి కొల్లు రవీంద్ర కారు ఎలా అడ్డుకుంటారు? | - | Sakshi
Sakshi News home page

ఇది మంత్రి కొల్లు రవీంద్ర కారు ఎలా అడ్డుకుంటారు?

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

● పోలీసులతో కారు డ్రైవర్‌, సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తిరుపతిలో శుక్రవారం జరిగిన కూటమిపాలన విజయోత్సవ సభా ప్రాంగణం వద్ద రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కారు ప్రవేశం కల్పించడంలో చోటుచేసుకున్న జాప్యం వాగ్వాదానికి దారి తీసింది. దీంతో రెచ్చిపోయిన కారు డ్రైవర్‌ ఇది మంత్రి కొల్లు రవీంద్రకు చెందిన కారు ఎలా అడ్డుకుంటారు.. మూడు రోజులుగా ఇక్కడే తిరుగుతున్నా ఆ మాత్రం గుర్తు లేదా? అని నిలదీశారు. పైపెచ్చు డ్రైవర్‌ ప్రవర్తించిన తీరు విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు ఆగ్రహం తెప్పించింది. అసంతృప్తికి గురి చేసింది. మరో వైపు మంత్రికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది కూడా తమదైన శైలిలో వాదనకు దిగారు. పోలీసులు సర్దుబాటు ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగి, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement