చోరీ కేసులో ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

రూ.7 లక్షల విలువైన నగలు స్వాధీనం

సూళ్లూరుపేట రూరల్‌: విలాసవంతమై జీవితానికి అలువాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని సూళ్లూరుపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారని డీఎస్పీ చెంబాబు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల విలువ గల నగలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ కథనం మేరకు.. సూళ్లూరుపేట మండలంలోని మన్నేముత్తేరిలో హోలీగ్రేస్‌ షాలోమ్‌ చర్చి వెనుక నివసిస్తున్న పాస్టర్‌ ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూళ్లూరుపేట మండలం కొమ్మినేనిపల్లికి చెందిన పాకం మనోజ్‌కుమార్‌, నాయుడుపేట కారుమంచి కండ్రిగకు చెందిన తొప్పాని ఈశ్వర్‌ చోరీ చేసినట్లు గుర్తించారు స్థానిక కోటపోలూరు క్రాస్‌ రోడ్డు వద్ద అనుమానస్పదంగా సంచరిస్తున్న వారిని సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమావేశంలో ఎస్వీయూ వీసీ

తిరుపతి సిటీ: బెంగళూరు వేదికగా ఇండో జర్మన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఐజీఎస్‌టీసీ) 21వ పాలకమండలి సమావేశం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు హాజరయ్యారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ సమావేశంలో వీసీ మాట్లాడుతూ భారత్‌, జర్మనీ మధ్య శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారం అవసరమని తెలిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఇరు దేశాలు అన్ని రంగాల్లో బలపడేందుకు ఆవకాశం ఉందన్నారు. ఎస్వీయూ సైతం ఇంటర్నేషనల్‌ సైంటిఫిక్‌ నెట్‌వర్స్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తు అంతర్జాతీయ స్థాయి పరిశోధనల వైపు అడుగులు వేస్తోందని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement