మ్యాపింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రోల్స్‌ శాతం పెంచండి | - | Sakshi
Sakshi News home page

మ్యాపింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రోల్స్‌ శాతం పెంచండి

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

తిరుపతి అర్బన్‌: మ్యాపింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రోల్స్‌ శాతా న్ని పెంచాలని డీఆర్వో నరసింహులు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు భరత్‌నాయక్‌, రోజ్‌మాండ్‌తో కలసి వీడియో కాన్ఫరెన్స్‌లో ఏడు నియోజకవర్గంలో ఎలక్ట్రోల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎలక్ట్రో రిజిస్ట్రేషన్‌ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రంలో అధికారులు, బూత్‌ లెవల్‌ అధికారులు మ్యాపింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రోల్స్‌ శాతాన్ని పెంచాలని స్పష్టం చేశారు. అయితే 10 శాతం కన్నా తక్కువ చేసిన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అయినప్పటికి తక్కువ శాతం ఉంటే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement