రాహు–కేతు పూజల్లో ఉచిత సేవ వ్యక్తుల దోపిడీపై విచారణ జరిపి, ఆ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. భక్తులను నిలువుదోపిడీకి గురిచేయడం సరికాదు. ఆలయంలోని వెండి నిల్వలపై పాలకమండలి, ఆలయాధికారులు శేతపత్రం విడుదల చేయాలి. భక్తులకు పసుపు దారాలు అంటగడుతున్న దళారుల మోసం అరికట్టాలి. – చిట్టివేలు జయగోపాల్,
ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు
వెండి నాగపడగలతో పూజలు చేయాలి
స్థానికుల కోసం రూ.వంద కు రాహు కేతు పూజలు చేయడం అనేది మంచి పరిణామమే. కానీ నాగ పడగలు లేకుండా సర్పదోష నివారణ పూజలు చేయడం మంచిది కాదు. అయితే దీనిని ఆలయంలో ఉండే వేద పండితులు సూచించకపోవడం బాధాకరం. నాగ పడగలు లేకుండా చేసే పూజ మంచిది కాదు. వెండి నిల్వపై శ్వేత పత్రం విడుదల చేయాలి.
– మున్నా రాయల్, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు


