చిన్నారి మృతితో చీపినాపిలో విషాదం | - | Sakshi
Sakshi News home page

చిన్నారి మృతితో చీపినాపిలో విషాదం

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

కలువాయి(సైదాపురం): గుండెవ్యాధితో బాధపడుతున్న చిన్నారి మృతితో చీపినాపిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కలువాయి మండలం చీపినాపి అరుంధతివాడకు చెందిన గార్లపాటి మహేంద్ర, నాగమ్మల కుమార్తె చరీష్మ (7) మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఈ బాలిక గత కొంత కాలంగా గుండె వ్యాధితో బాధపడుతూ సోమవారం ఉదయం నెల్లూరులోని ఆస్పత్రిలో మృతి చెందింది. అభం, శుభం తెలియని చిన్నారి మృతితో గ్రామంలో విషాధం నెలకొంది. విషయం తెలుసుకున్న కలువాయి ఎంఈఓ–2 జనార్దన్‌రెడ్డి పాఠశాల సిబ్బంది చీపినాపిలో విద్యార్థి అంత్యక్రియలకు హాజరై వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement