రోడ్డు సగం వేసి వదిలేశారు! | - | Sakshi
Sakshi News home page

రోడ్డు సగం వేసి వదిలేశారు!

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

● ఓ యువకుడు వినూత్నశైలిలో నిరసన

● ఓ యువకుడు వినూత్నశైలిలో నిరసన

సైదాపురం: సైదాపురం –పొదలకూరు రహదారి సగం వేసి వదిలేశారని ఎస్పీఎఫ్‌ స్టూడెంట్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో సోమవారం కలిచేడు బస్టాండ్‌ వద్ద నులక మంచం వేసుకుని ఆ సంస్థ వ్యవస్థాపకుడు షఫీహరన్‌ వినూత్నశైలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన సైదాపురం మండలం కలిచేడులో చోటు చేసుకుంది. ఈ విషయం సోషల్‌ మీడియోలో హల్‌ చల్‌ చేస్తోంది. అయినా సంబంధిత ఆర్‌అండ్‌ బీ శాఖ అధికారులు పట్టించుకునే పాపాన పోలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గుమ్మడి వీరాస్వామి పాల్గొన్నారు.

కల్యాణి డ్యామ్‌లో

రెండో రోజు గాలింపు

చంద్రగిరి: కల్యాణి డ్యామ్‌లోకి దూకి గల్లంతైన పుంగనూరుకు చెందిన మురళి ఆచూకీ కోసం పోలీసులు సోమవారం కూడా ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక రెస్క్యూ టీమ్‌ డ్యామ్‌లో జల్లెడ పట్టింది. ఎస్‌ఐ అరుణాచలం ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్‌ బృందం ద్వారా గాలించడంతో పాటు డ్రోన్‌ కెమెరాల ద్వారా మురళీ ఆచూకీ కోసం ముమ్మరం గాలించినా ఫలితం దక్కలేదు. మంగళవారం కూడా గాలింపు చర్యలను చేపట్టనున్నట్లు ఎస్‌ఐ అరుణాచలం తెలిపారు.

లారీని ఢీకొని స్కూటరిస్ట్‌ మృతి

పాకాల: ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి స్కూటరిస్ట్‌ ఢీ కొనడంతో స్కూటరిస్ట్‌ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి పాకాల మండలంలో సోమవా రం చోటు చేసుకుంది. పోలీసు ల కథనం మేరకు.. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిలోని నేండ్రగుంట వద్ద చిత్తూ రు నుంచి తిరుపతి వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి స్కూటర్‌పై వెళుతున్న ఎం.హరీష్‌(30) ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అన్నమయ్య జిల్లా కలికిరి మండలం తుమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప కుమారుడిగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగమంజుల తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement