వైఎస్సార్‌ సీపీలో టీడీపీ నాయకుల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో టీడీపీ నాయకుల చేరిక

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కొత్తపాళెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రాజా సోమవారం సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారితోపాటు వారి అనుచరులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి పాలన నచ్చక వైఎస్సార్‌సీపీలో చేరుతున్నామని పార్టీలో చేరిన నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ మణినాయుడు, ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గురునాథం, వైస్‌ ఎంపీపీ మునికృష్ణారెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, హరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement