ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను సాక్షి దినపత్రికలో ‘శుద్ధజలం.. అందని ఫలం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని కలర్ ప్రింట్‌లు తీసుకుని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. పీజీఆర్‌ఎస్‌లో ఈ మేరకు డీఆర్వో నరసింహులుకు వినతి పత్రం అందజేశారు. అక్కడే ఉన్న డీఈఓ కేవీఎన్ కుమార్‌ను పిలిచి తక్షణం సమస్యను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నట్టు ఆయన చెప్పడంతో జిల్లాలో సమస్యను పరిష్కరించుకోలేమా? విద్యార్థి సంఘం నేతలు చెప్పేంత వరకు మనం వేచి చూడాలా? అని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దినేష్‌కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మునిశేఖర్, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు గూడూరు రఫీ, చంద్రగిరి మండల అధ్యక్షులు వినోద్‌కుమార్, రామచంద్రాపురం మండల అధ్యక్షుడు యశ్వంత్‌రెడ్డి పాల్గొన్నారు.


