తిరుపతి అన్నమయ్య సర్కిల్: టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు శ్రీభగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు రోజులపాటు ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాహితీ సదస్సులు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం శ్రీరామానుజాచార్యుల వైభవంపై ఉపన్యాసం, తరువాత భక్తి సంగీత కార్యక్రమం జరుగుతుంది. మంగళవారం శ్రీ రామానుజాచార్యులు–తిరుమల కై ంకర్యం ప్రసంగం, తరువాత హరికథ కార్యక్రమం ఉంటుంది.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
పెళ్లకూరు: మండలంలోని నందిమాల గిరిజన కాలనీకి చెందిన సాగి అనీల్‌కుమార్ ఇల్లు ఆదివారం విద్యుత్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితుని కథనం.. అనీల్‌కుమార్, అతని భార్య వరలక్ష్మి ఇంటి వద్ద ఉన్నారు. ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ వైర్లు షాట్ సర్క్యూట్‌కు గురయ్యాయి. ఇంటి పైకప్పుపై మంటలు చెలరేగాయి. దంపతులిద్దరూ కేకలు వేయగా స్థానికులు వచ్చే లోపు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని దుస్తులు, వస్తు సామగ్రి, గేదెలు కొనుగోలు కోసం పొలం అమ్మి తెచ్చిపెట్టుకున్న రూ.2లక్షల నగదు, రెండు సవర్ల బంగారు ఆభరణాలు కాలిబూడిదయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
లోయలోకి
దూసుకెళ్లిన లారీ
చంద్రగిరి: ప్రమాదవశాత్తు లారీ లోయలోకి దూసుకెళ్లిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆదివారం పీలేరు నుంచి తిరుపతి వైపు ఓ లారీ వస్తోంది. భాకరాపేట కనుమలోనికి ప్రవేశించగానే పెద్ద మలుపు వద్ద లారీ అతివేగం కారణంగా అదుప్పు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జుకాగా డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సురేష్‌కుమార్ తెలిపారు.
వృద్ధురాలిపై దాడి
తిరుపతి క్రైమ్: తన ఇంట్లోనే నిద్రిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాతయ్యగుంట సమీపంలోని మల్లంగుంటలో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమైపె దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆమైపె లైంగిక దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వెల్లడించారు. పైఅంతస్తులో నివశిస్తున్న ఆమె కుమారుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. గాయాలతో ఉన్న వృద్ధురాలిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించినట్లు సీఐ పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో అనుమానితుని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లైంగిక దాడి జరిగిన అంశంపై వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఘటన స్థలాన్ని ఏఎస్పీలు శ్రీనివాసులు, రవి మనోహరాచారి, తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం, క్లూస్ టీం సందర్శించారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
పాకాల: మనస్తాపంతో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం.. చిత్తూరు రోడ్డుకు సమీపంలోని కృష్ణారెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్న వై.వెంకన్న(40) తిరుమలలో డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. అనారోగ్య కారణంగా మనస్తాపానికి గురయ్యాడు. సూసైడ్ నోట్ రాసి ఉదయం 4 గంటల ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. హెచ్‌సీ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


