శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని అరవకొత్తూరు గ్రామ శివారులోని బావిలో గురువారం సాయంత్రం ఇద్దరు మరణించారు. వీరి మ రణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు అరవ కొత్తూరు గ్రామానికి చెందిన త్రిహాల్ (12), బీపీ అగ్రహారానికి చెందిన తరుణ్ రెడ్డిగా గుర్తించారు. గురువారం సాయంత్రం త్రిహాల్ ఈత కోసం బావికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీట మునగడంతో అతడిన్ని కాపాడేందుకు సమీప బంధు వైన తరుణ్ రెడ్డి నీటిలోకి దూకాడు. ఇద్దరూ బావి లోతులో చిక్కుకొని చనిపోయారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. అరవ కొత్తూరు గ్రామానికి చెందిన బాలకృష్ణ, సుకన్య దంపతుల ఏకై క కుమారుడు త్రిహాల్ చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. త్రిహాల్ తండ్రి బాలకృష్ణ గతంలో మరణించాడు. ఇప్పుడు కొడుకు కూడా చనిపోవడంతో ఆ తల్లి రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
వెంకటగిరి రూరల్: రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉండడాన్ని శుక్రవారం రైల్వేపోలీసులు గుర్తించారు. గూడూరు రైల్వేపోలీసుల కథనం మేరకు.. ఎల్లకారు–గూడూరు మార్గం మధ్యలోని ఎల్లకారు వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని సుమారు 35 ఏళ్ల వ్యక్తి మృతదేహం ఉన్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పరిశీలించగా మృతిడి వద్ద ఎటువంటి ఆచూకీ లభించలేదు. మృతుడు బ్లూ కలర్ టీషర్ట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు తిరుపతి నుంచి గూడూరు వైపు వెళ్లే రైల్లో ప్రయాణిస్తున్న జారి పడి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సీఏఓ బదిలీ
తిరుపతి లీగల్: స్థానిక మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్వీ రాఘవ సాయి కుమార్‌ను కర్నూలు జిల్లా కోర్టు పరిపాలన అధికారిగా బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 31 మంది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కలెక్టరేట్‌లో స్వీయగణన
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో 2026–27 జనగణనలో భాగంగా శుక్రవారం తమ మొబైల్ ద్వారా స్వీయగణన కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్ ఏఓ రామాంజుల నాయక్‌తోపాటు పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ తమ మొబైల్స్ ద్వారా చేసుకున్నారు. అలాగే కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సెల్ప్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని ప్రోత్సహించారు.
మామూళ్లు
ఇవ్వనందుకే కేసులు
కార్వేటినగరం: మామూళ్లు ఇవ్వకపోతే ఎకై ్సజ్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని శ్రీరంగరాజపురం మండలం మంగుంట గ్రామానికి చెందిన బెల్టుషాపు యజమాని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాను మూడు నెలలుగా ముడుపులు చెల్లించలేదని కక్షగట్టి కేసులు పెట్టారని ఆరోపించారు. కార్వేటినగరం ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని మండలాల్లో బెల్టుషాపులు లెక్కలేనన్ని ఉన్నాయన్నారు. అందులో ఒక్కో షాపునకు నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఎకై ్సజ్ అధికారులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఒక నెల మామూళ్లు చెల్లించకపోయినా అక్రమ మద్యం విక్రయిస్తున్నట్టు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని వాపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో బెల్టుషాపులు వెలిశాయని, ఒక్కో గ్రామంలో రెండు నుంచి 4 వరకు కూడా ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 120 నుంచి 160 వరకు బెల్టుషాపులు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 63,454 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,882 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.


