రుయా ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స | - | Sakshi
Sakshi News home page

రుయా ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

తిరుపతి తుడా: రుయా ఆస్పత్రిలో ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన సుబ్బారావు (45) రెండేళ్లుగా కడుపునొప్పి, కడుపులో గడ్డ, రక్తహీనతతో బాధపడుతూ రాష్ట్రంలో అనేక ఆస్పత్రులు తిరిగినా వైద్యులు పరిస్థితి క్లిష్టంగా ఉందని, ఆపరేషన్‌ చేయడానికి వీలుపడదని తెలిపారు. దీంతో ఆయన కుటుంబ సభ్యుల సహాయంతో రుయాస్పత్రిని సంప్రదించారు. దీంతో రుయా ఆస్పత్రిలో జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య బృందం ఆయనను అడ్మిట్‌ చేసుకుని రక్త పరీక్షలు నిర్వహించి, కడుపులో ప్లీహం అనే అవయవం చాలా పెద్దదిగా ఉందని, అందువలన రక్తహీనత వచ్చిందని గుర్తించారు. రుయా వైద్యులు క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి, రోగిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులకు రోగి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement